శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2020 (11:30 IST)

16వ బిడ్డకు జన్మనిస్తూ మహిళ మృతి.. శిశువు కూడా..?

16వ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇక నవజాత శిశువు కూడా చనిపోయింది. మధ్యప్రదేశ్ జిల్లాలోని పదాజిర్ గ్రామానికి చెందిన సుఖ్రానీ అహిర్‌వార్ అనే మహిళ శనివారం ఇంట్లో పసికందును ప్రసవించిందని జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కింద గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త (ఆశా) కల్లో బాయి విశ్వకర్మ తెలిపారు.
 
కానీ ప్రసవం సందర్భంగా మహిళతో పాటు నవజాత శిశువు పరిస్థితి క్లిష్టంగా మారింది. తర్వాత వారిని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు, అక్కడ వారిద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. 
 
ఇకపోతే.. అహిర్వర్ ఇంతకుముందు 15 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, వారిలో ఏడుగురిని కుటుంబం కోల్పోయింది. తాజాగా 16వ బిడ్డకు జన్మనిస్తూ.. ఆమెతో పాటు శిశువు కూడా కన్నుమూసింది. ఈ సంఘటనను జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సంగీత త్రివేది ధృవీకరించారు.